పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రెకు: 0158-1 హిందోళవసంతం సంపుటం: 07-339

పల్లవి:
చెలులము నేము బుద్ధి చెప్పనోపమాకెకు
అలరి నీవాపెను మాఁటాడించవయ్యా

చ.1:
మక్కువతో నాపె నీవు మాటలాడేవంటాను
పక్కునఁ బాన్సుపైనీకె పవళించె
వెక్కసాన నింతలోన విచ్చేసితివీడకు
నెక్కొని నీవే యిఁక నిద్రలేపపయ్యా

చ.2:
తతితో విందాకెయింటఁ దగనారగించేవంటా
అతివ బోనమెల్లా చల్లారఁబెట్టెను
అతివేడుకనింతలో నాఁకలిగొంటిననేవు
కతగా నీవే వడ్డించఁ గైకొలుపవయ్యా

చ.3:
కందువనాపెతో నేఁడు కాఁపురము సేసేవంటా
వొందిలిఁ దలుపు మూసుకున్నది చెలి
అందుకె శ్రీ వేంకటేశ అండకేఁగి కూడితివి
చెంది నీవె వాకిలాపెచేఁ దెరపించవయ్యా