పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0106-3 ముఖారి సంపుటం: 07-033

పల్లవి:
ఏల నాతో బొంకవచ్చే వెఱఁగనా నేఁదొల్లి
వాలాయించి మాకు మంచివాఁడవే యెప్పుడును

చ.1:
దవ్వులనే మొక్కుమని దయ నాపైఁ బెట్టుమని
యెవ్వతె చెప్పెనో కాక యీబుద్దులు
నివ్వటిల్ల నీ యంత నీవెఱఁగవింతేసి
చివ్వన నొకరి పెట్టుఁజెట్టవే యెప్పుడును

చ.2:
చేచేత వేఁడుకొమ్మని చెక్కునాకు నొక్కుమని
యే చదువులోనుండెనో యీవోజలు
నీ చందములివి గావు నేఁడు గొత్తలా నాకు
సూచింప నొకరాడించే సూత్రమవెప్పుడును

చ.3:
అక్కర నిచ్చలాడేవు ఆయము గరఁగించేవు
యెక్కడ నేరిచితివి యీరతులు
నిక్కి శ్రీ వేంకటేశుఁడ నేఁడు గూడితివిగాక
గుక్కకొకని పెంపుడుగున్నవే యెప్పుడును