పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0157-5 సామంతం సంపుటం: 07-337

పల్లవి:
ఏమని పాగడుదుమె యీవెలిచక్కఁదనము
యీమేఁటి యలమేల్మంగ యెక్కువైతానిలిచె

చ.1:
అరచంద్రుఁడుఁ జకోరాలద్దాలు సంపెఁగయు
ధర శింగిణులు శ్రీలు తలిరులును
అరుదుగాఁ దుమ్మిదలుసందముగాఁ గూడఁగాను
మరుతల్లి యలమేలుమంగమోమై నిలిచె

చ.2:
బిసములు శంఖమును పెనుఁజక్రవాకములా
కసము నీలపుఁజేరు కరికుంభాలు
పాసఁగ నివెల్లానాకపోఁడియై నిలువఁగాను
మసలక అలమేలుమంగమేనై నిలిచె

చ.3:
అనఁటులంపపాదులు నబ్దములు ముత్తేలు
వొనరి వరుసఁ గూడి వుండఁగాను
ఘనుఁడైన శ్రీ వెంకటేశునురముమీఁద
పనుపడలమేల్మంగ పాదములై నిలిచె