పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0157-3 మధ్యమావతి సంపుటం: 07-335

పల్లవి:
చేసినట్టుల్లాఁ జెల్లె సేఁతలు నీకు
గాసిఁబెట్టుకిఁక నన్నుఁ గరుణించవయ్యా

చ.1:
చెప్పినట్టుసేయఁగానె చెరఁగేల పట్టేవు
తప్పులెంచననఁగానె తడవనేల
కొప్పువంచి మొక్కఁగానె గుంపెనపంతాలేల
ముప్పిరి దప్పులు దేర మోవియ్యవయ్యా

చ.2:
సరములాడఁగానె సాదించనేల వచ్చేవు
కెరలించకుండఁగానె కేరడమేల
పరగ నేఁ బండఁగానె బలిమిసేయఁగనేల
గరిమ నాకోరినట్లు కాఁగలియ్యవయ్యా

చ.3:
కూడి రతిసేయఁగానె కొరేల చూపేవు
వీడెమందుకొనఁగానె వేసాలేలా
పాడితో శ్రీవేంకట పట్టపలమేల్మంగను
జాడతోనింకాను సేలు చల్లవయ్యా