పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0157-1 బౌళిరామక్రియ సంపుటం: 07-333

పల్లవి:
అలిగినవేళ విభుఁడంటితేఁ గోపమే తోఁచు
తెలుసుక నీలోనే తేరుకొవే చిత్తము

చ.1:
వేసవికాలమునాఁడు వేడుకైన వెన్నెలలే
యీల విరహవేళనెండలై తోఁచు
వాసితోఁ దానేరిపిన వన్నెచిలుకమాటైన
పాసినదంపతులకు పగిలించు మర్మము

చ.2:
సోవఁ దనమేవనున్న సొంపుల జవ్వనమైన
కోవిలకూఁతలవేళ గొరబై తోఁచు
పూవులు తాఁ గొప్పులోన పూఁచి ముడిచినవైన
కావిరిఁ దానొంటినుంటే కంతునమ్ములౌను

చ.3:
ప్రతిలేని తనలో ప్రాణపుటూరుపైన
రతినలసినవేళ రంపమై తోఁచు
యితవై శ్రీ వేంకటేశుఁడింతలోనె నిన్నుఁగూడె
సతమై యీవిరసాలే సరసములాయెనే