పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0156-6 శంకరాభరణం సంపుటం: 07-332

పల్లవి:
పోపో అదేఁటిమాట పొద్దువోదా
మాపుదాఁకా నదే కాక మరియేఁటిమాటలే

చ.1:
గుత్తులపూవులు నీవు కోవయ్య కానికె ఆ
గుత్తులేల నీచనుగుత్తులీరాదా
జొత్తులైన లతలవే చూడవయ్య మాటలేల
హత్తి నీబాహులతలు అవె కంటినే

చ.2:
పండుబలమిదివో పట్టువయ్య సూడిదె
పండులేల నీమోవిపండె కాక
మెండగుఁ దామరలు మీఁదవేసేఁ జుమ్మీ
దండి నీచేతులె రెండుతామరలు గావా

చ.3:
కప్పురమిచ్చే నీకుఁ గైకోవయ్యా ఆ
కప్పురాలు నీనోరికతలెకావా
యిప్పుడె శ్రీ వెంకటేశ యిటుగూడితి నేఁ
డిప్పుడా అల్లప్పుడెపో యెరఁగవు గాని