పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0156-5 పాడి సంపుటం: 07-331

పల్లవి:
ఏమి సేతు ముచ్చటకు యెవ్వరు గలరు నాకు
యేమీననకూరకున్న యెగ్గుపట్టుఁగా

చ.1:
అడుగుదునో వానినాడనేల వుంటివని
అడుగఁబోనలుగుఁగా అందుకతఁడు
తుడుతునో వానిమేనఁ దొరిగే వేఁడివెమట
చిడిముడి వాఁడందుకు సిగ్గవడుఁగా

చ.2:
విసరుదునో సురటి విభునియలపు దీర
విసరఁబో అదియును వెంగెమౌఁగా
కొసరుదునో తనగుట్టు నేఁగనినదాఁకా
ఇమంతపనికి మనసు నొచ్చుఁగా

చ.3:
నవ్వుదునో రమణుఁడు నాతోఁ గరఁగినవేళ
నవ్వఁబో ఆతనిమేలు నామేలుగా
రవ్వగా శ్రీ వేంకటాద్రిరాయఁడిట్టె నన్నుఁగూడె
యివ్వల మోవియిత్తునో యిచ్చగించఁగా