పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0156-4 బౌళి సంపుటం: 07-330

పల్లవి:
ఇందాఁక నెరఁగము యీవింత సతి
కందు వాసె శ్రీకాంతావిభుఁడ

చ.1:
సుదతికి నీరాక సూర్యోదయమై
వదనకమలమిటు వడిఁ జెలఁగె
పాదలిన నీనవ్వుపున్నమవెన్నెలకు
కదిసి చకోరపుకన్నులు దెలిసె

చ.2:
వనితకు నీచూపు వసంతకాలమై
వెనకఁ బలుకుఁగోవిలలొదరె
మినుకు నీతనువుమేఘకాంతులకు
పనివడి పులకలపైరులు దేరె

చ.3:
సతికి నీపాందులె జలధిమథనమై
రతినధరామృతరస మబ్బె
ఇతవై శ్రీ వెంకటేశ నీవు చెలిఁ
దతిఁ గూడఁగ మరుతంత్రము గెలిచె