పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0156-3 బౌళి. సంపుటం: 07-329

పల్లవి:
హరి యేమనెనే అలిగెనో
విరహినై నేనుండఁగా యేలరాఁడాయ

చ.1:
మరలి మరలి తన్ను మాటలఁ గొసరను
యిరవైన విభుఁడేమనెనే
తరుణులే వచ్చితిరి తానాడనున్నాఁడు
యెరవెరవై తానేమనెనే

చ.2:
వాకిటికిందాఁక వచ్చి తిరిగెనట
యేకారణమిది యేమనెనే
రాకలఁ బోకల రాతిరాయనిదె
యీకడఁ దుదమాఁటేమనెనే

చ.3:
తలపులో ప్రియరము తానే యెరుఁగును
యెలుఁ గెత్తొకమాఁటేమనెనే
బలిమి శ్రీవేంకటపతి దా విచ్చేసి
యిల ననుఁగూడెను యేమనెనే