పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0156-2 శ్రీరాగం సంపుటం; 07-328

పల్లవి:
ఇంత యేల బిగువు యిది లెస్స తగవు
నంతకూటపుమాటలు చాలునయ్య నీవు

చ.1:
పట్టినదే పంతమా పడతిఁ బిలువరాదా
చుట్టుమవో నీవు లేక సూడుబంటవో
యెట్టుయెదురనున్నారు యెడమాటలాడలేము
రట్టుపాలకమ్మకెక్కె యిట్టెరావయ్యా నీవు

చ.2:
చెల్లినంతాఁ జేఁతా చెలియఁ జేకొనరాదా
యెల్లగా నవ్వులకో యిదే నిజమో
తెల్లవారె సిగులనే తెగి మిమ్ము దూరలేము
అల్లమే సొంటిగాదా అవునయ్య నీవు

చ.3:
ఆడినదే యాటా ఆకెఁజక్కఁజూడరాదా
వీడుదోడువయసులు వేడుకో వెట్టో
ఈడనే శ్రీ వేంకటేశ యింతిఁ గూడితివి నీవు
వోడలు బండ్లవచ్చు వుండవయ్య నీవు