పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0106-2 పాడి సంపుటం: 07-032

పల్లవి:
ఇంకనేల సుద్దులు యెదురూఁ గుదురుగాను
సుంకు మోచిన కళలు సూట్లాయను

చ.1:
సరస నిలుచుండఁగా సతి తురుము విరులు
పరిమళముతో నీపై రాలెను
ధరనవే నేసలాయ తగ మరునమ్ములాయ
మరిగితీమరఁగేల మంచిదాయను

చ.2:
చేతికి విడెమియ్యఁగ చెలియకుచాలు నీకు
నాతల యీతలను ఆయాలు మోచెను
ఘాత నిమ్మపండ్లాయ కానికలవే ఆయ
యీతల మాయలేఁటికి నియ్యకోలే ఆయను

చ.3:
ఇదె శ్రీ వేంకటేశ నేఁడిఁతి నీతో మాటాడఁగా
పెదవి పెదవి దాకి ప్రేమము రేఁగె
అదన నన్నుఁ గూడితి వనువాయఁ దనివాయ
కొదలెల్లాఁ దీరెనిదే గుఱులాయను