పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0155-6 శంకరాభరణం సంపుటం: 07-326

పల్లవి:
ఎంతజాణ నీచెలియనేమని పాగడవచ్చు
దొంతులమాఁటలలోనే దోమటి దొడికెను

చ.1:
మెట్టిన చమ్మాళిగలు మించఁ బారితెంచి నిన్ను
పట్టితీసి మొలనూలు పైపై చెలి
అట్టి కోపాన నీవు ఆఁపలేక పెనఁగఁగ
తిట్టేన నీమోవి గంటి తెగి సేసెనప్పుడే

చ.2:
వంచిన పయ్యదకొంగు వల్లెవాటు వేసుకొని
కొంచక నీమొగమై కొనగోరను
ఇంచుకంత నీవందుకు యియ్యకొనకుండఁగాను
ముంచి నిన్నుఁ దనచను మొనలనాఁగీని

చ.3:
వాకునిండా కస్తూరివాసనలు చల్లి చల్లి
యేకతమాడి చెలి యిప్పుడే నీతోను
యీకడ శ్రీ వేంకటేశ యియ్యకొని కూడఁగాను
లోకము మెచ్చేటి నిన్ను లోను కొనెను