పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0155-5 ఆహిరి సంపుటం: 07-325

పల్లవి:
ఇదె వీఁడె చూడవే యించుక మాటాడవే
యెదురై కూడితిరి మీరిఁకనేలె యలుక

చ.1:
తామెరలు వికసించె తరుణి నేడు నీమోహము
తామర వికసించదు తగునటవే
తామెరకుఁ జుట్టుము ధరణీిపై సూర్యుఁడు
నీమోముదామెరకు నీవిభుఁడు చుట్టుము

చ.2:
కలువలు వికసించె కలికి నేఁడు నీకన్నుఁ
గలువలు ముకుళించఁ గారణమేమే
కలువలచెలికాఁడు కందువచంద్రుఁడు నీ
కలువకన్నులకు నీకాంతుఁడెపో చుట్టుము

చ.3:
వనములు వికసించె వనిత నేఁడు నీజ
వ్వనమును వికసించ వైపాయనే
వనదేవతందుకైతే వసంతుఁడు నీకు మిం
చినవనదేవతైతే శ్రీ వెంకటేశుఁడు