పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0155-4 దేసాళం సంపుటం: 07-324

పల్లవి:
ఏల వెరచేవే నీవు యిదివో నీపతివచ్చె
జాలివాయ నిన్నుఁగూడిసంతసమిచ్చీని

చ.1:
నీరధిలోఁ బుట్టివట్టి నీరుచిచ్చైన పూవు
నూరిపోసినట్టి పామునోరిలో కడి
మారుతో నగ్నిఁబడిన మాకులలో భూతము
యీరీతి విరహులకెగ్గు సేయకుందురా

చ.2:
తల్లిదండ్రి వెంచనట్టి తగుఁబలుగాకి చూర
చల్లుఁ బుప్పాడి దొంగిలిన జాజరకాఁడు
మల్లాడి చెట్లమీఁద మధువువట్టిన పాత
వెళ్లిగా మంచిగుణాలు వీనికింక వచ్చునా

చ.3:
వంగి వంచనేర్చిన వడిఁదియ్యని గుణము
ముంగిట నిందరి చిత్తముల వెలుపు
ఇంగితాన శ్రీ వేంకటేశు నిన్నుఁ గూడఁజేసి
రంగన నీపాలింటికి అందరను హితులే