పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0155-2 శ్రీరాగం సంపుటం: 07-322

పల్లవి:
చల్లలమ్మేదానవు అచ్చపుమగనాలవు
మల్లడిమాపాందులేల మరిగేవు నీవు

చ.1:
కమ్మి పున్నమవెన్నెల గాదెఁబోసికొంటివటే
యెమ్మెకే సెలవి నవ్వేవేపొద్దును
తమ్మిరేకులెల్లాఁదెచ్చి దాఁచుకవుందానవటే
కుమ్మరించేవు కన్నులఁ గుచ్చికుచ్చి మీఁదను

చ.2:
చిలుకపలుకులెల్లఁ జేన విత్తుకొంటివటే
వొలికేవు పెదవుల నొకటొకటే
కులికి చిగురులెల్లఁ గోసితటే మావాకిట
వెలయ నీయడుగుల వెదచల్లేవు

చ.3:
సోగతీఁగెలెల్ల నీసామ్మటే నీచేతులను
భోగపుఁ గాఁగిట నన్నుఁ బొదిగేవు
యీగతి నే శ్రీ వేంకటేశుఁడ కూడితి నిన్ను
జాగులేల యిక్కడనే సతమై నిలువవే