పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0155-1 హిందోళవసంతం సంపుటం: 07-321

పల్లవి:
ఒకటి గలిగినచోట నొకటి లేదు
వికటంపుటలుకేలె విభుఁడెదుట వీఁడె

చ.1:
ఉవిద నీమోము చంద్రోదయంబై యుండి
నివురు నీ నవ్వువెన్నెల గాయదు
చివురుమోవి వసంతసిరి దొలఁకి యుండియును
యివలఁ గోవిలేల యెలుఁగియ్యవే

చ.2:
వనిత నీ నిండుజవ్వనవనము గలిగియును
మినుకు నడపులకరులు మెదలవేలే
ఘనమైన చన్నుజక్కవలు మితిమీరఁగా
చెనసి నివ్వెరగుమతి చీఁకటిఁకనేలే

చ.3:
మెలుఁత నీ నెరిఁదురుము మేఘంబు గలిగియును
తొలఁకు మెరుఁగులకళలు దోఁచవేలే
ఎలమితో శ్రీవేంకటేశుఁడింతటఁ గూడె
కలదెల్ల గర్వమై ఘటియించనేలే