పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0154-5 రామక్రియ సంపుటం: 07-319

పల్లవి:
చిత్తగించి యేఁటికో విచ్చేసితి గాక
హత్తి నన్ను బుజ్జగించేవన్నిటా జాణవయ్యా

చ.1:
సరసమాడఁగ నీకు సతి శూర్పనఖ గద్దు
పారిఁ జన్నిచ్చి పెంచఁగఁ బూతకి గద్దు
పారసి కామించి నిన్ను భోగించఁ గుబ్జ గద్దు
తిరిగి మాయింటికి రాఁదీరునటవయ్యా

చ.2:
అంది నీకుఁ గావఁబో నావులమంద గలదు
కుంది వయ్యాళికి రాతిగుఱము గద్దు
అందపుబోయిఁడవుగా నర్దునుని బండి గద్దు
దిందుపడి యీడకు రాఁదీరునటవయ్యా

చ.3:
సారెఁ బవళించఁ బాలజలనిథి నీకుఁ గద్దు
పోరచి దానమడుగ భూమి గద్దు
చేరి నిక్కిచూడ శ్రీవేంకటాద్రి గద్దు
తేరి నన్నుఁ గూడితివి తీరునటయ్యా