పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0154-2 ముఖారి సంపుటం: 07-316

పల్లవి:
అలుగుత లేదు సుమ్మీ అప్పుడు నీతో
యెలమి నోరమణుఁడ యేమనివుండితివో

చ.1:
ఎదుట నీవుండఁగాను యేఁపే మరుఁడొ యంటా
అదివో గుండెబెదరి అవ్వలిమోమైతి
కదిసి చేయివేయఁగాఁ గమ్మచిగురుటమ్మంటా
నుదిరిపడి వెరచి వుస్సురంటిని

చ.2:
మలసి చూడఁగఁ జల్లె మంతపువెన్నెలలంటా
తొలఁగి పయ్యద నామైఁ దుడుచుకొంటి
పలికి మాటాడఁగాను పంపుడుఁ జిలుకలంటా
నిలువున వెరగంది తలవంచుకొంటివి

చ.3:
కాఁగిట నీవు గూడఁగాఁ గలలోని భ్రమతలంటా
కాఁగిన కుచములతోఁ గన్నుమూసితి
సోగల నీకొనగోరి సోఁకులనిన్నీఁ దెలిసి
బాగుల శ్రీ వెంకటేశ పైకొంటివి