పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0154-1 ఖైరవి సంపుటం: 07-315

పల్లవి:
చెల్లెఁ జెల్లె నీచేఁత శింగరి నీ
వుల్లమెల్లఁ దక్క గొంటినో శింగరి

చ.1:
చిక్కని నీనవ్వుచూచి శింగరి నే
నొక్కటై నీకు మొక్కితినో శింగరి
చెక్కులఁ జెమటగారె శింగరి నీ
వుక్కుగోరు సోఁకనీకు వో శింగరి

చ.2:
చిరుత నిట్టూర్పుల శింగరి నిను
నొరసీఁబో నాకు చాలు వోశింగరి
సిరుల నిట్టచూపు శింగరి నీ
వొరపు నాచేతఁజిక్కెనో శింగరి

చ.3:
చేవదేరె నీమోవి శింగరి నే
నోవరిలోఁ గూడఁగానె వో శింగరి
శ్రీ వేంకటాద్రిమీఁది శింగరి
వోవమన సిగ్గదేరెనో శింగరి