పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0153-6 వరాళి సంపుటం: 07-314

పల్లవి:
ఒరయుచు నురమున నునిచితివీకె నీవు
అరయఁ గాంతారత్నమన్నిటాఁ గనక

చ.1:
మాటలాడి చూచితేనే మంచివైడూర్యాలు రాలీ
గాట్టఁపుజూపల మాణికాలు రాలీని
మూటగాఁగ నవ్వితే ముత్యాలు రాలీని
కూటువ నీసతి రత్నకోమలి గనక

చ.2:
బడినడుగడుగుకుఁ బద్మరాగములు రాలీ
జడిసి పాలసిఁ బచ్చలు రాలీని
పడఁతి చేవిసరినఁ బగడాలు రాలీని
నడుమ నీసతి యంగనామణి గనక

చ.3:
కుంకుమచెమటల గోమేధికాలు రాలీ
సంకుగోరికొన వజ్రాలు రాలీని
పొంకపుఁఋష్యరాగాలు పాంగీ నీకూటమిని
ఇంక శ్రీ వేంకటేశ నీయింతి రత్నాంగి గాన