పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0153-4 తెలుఁగుఁగాంబోది సంపుటం: 07-312

పల్లవి:
ఎరుక చెప్పే నీయిచ్చ యెల్లానెరుఁగుదు
మెరుఁగైన సామ్ములిచ్చి మెచ్చవయ్య నన్ను

చ.1:
చేతికి కల పలము చెప్పే రావయ్య నీకు
ఘాతలఁ బరాంగనలఁ గాఁగిలింతువు
ఈతలఁ గన్నులమేలిటు చెప్పే రావయ్య
సూతకపుమానములు (?) చూడఁగలదిఁకను

చ.2:
మోవిలక్షణాలు నీకు మోవఁజెప్పే రావయ్య
చావనొక్కరాకాసిచన్ను దాగితి
వావిరి నీపాదముల వ్రాఁతల జయము చెప్పే
బావిమడుగుననొక్క పాముఁ దొక్కితివి

చ.3:
ఇంగితాకారపుభాగ్యమిటు చెప్పే నీవురాన
నంగన మోహించి పాయకయున్నది
తంగని శ్రీ వేంకటేశ తలఁపు చెప్పే నన్నుఁ
బొంగుచుఁ గూడి యిట్టే పోననేవయ్యా