పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0153-3 ఖైరవి సంపుటం: 07-311

పల్లవి:
నిన్నుఁ బాసినకతాన నెలఁతకింతేసి పుట్టె
కన్నులఁ జూచితివింకఁ గావవయ్య చెలిని

చ.1:
జలములోపలఁ బుట్టె జలజమందురు గాని
జలజాస్యమున నేత్రజలములుబ్బె
అలయగ్ని నీటిచే నారునందురు గాని
వెలయఁ జెమటనీరు విరహర్నినిగిరె

చ.2:
ఇంపులఁ దీగెఁ బూవులెసఁగునందురు గాని
తంపి పూవులనదివో తనులత
సంపెంగకు తుమ్మ్బిదలు జరగునందురు గాని
సంపెంగ ముక్కునవాలె జాలియలినెరులు

చ.3:
మించె మేఘముమీఁద మెరుఁగనందురు గాని
నించుఁ జెలిమెరుఁగుపై నీలమేఘాము
అంచల శ్రీవేంకటేశ అతివ నీవు గూడఁగా
యెంచఁగ నీమన్ననలనెక్కుడాయఁ గాని