పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0153-1 దేసాళం సంపుటం: 07-309

పల్లవి:
ఇద్దరినేలేననీఁ బో యొనయదమ్మా యీ
సుద్దులేల యీడకే తాఁజొచ్చి రానీవమ్మా

చ.1:
ఒప్పుగనాకెను నన్నునొక్కటి సేయఁ బనిచీ
వుప్పులోఁ గప్పురమేల వొద్దమ్మా
అప్పటి నావుసురుల నాకెవుసురులఁ దన్ను
దప్పిదేర విసరేయు తనకేమోయమ్మా

చ.2:
మూలనాకెచేత నాకు మొక్కించఁ బలీచీని
పాలలోనఁ బులుసేల పదవమ్మా
ఆలి నామైకాఁక నాకెమేని కాఁకలను
కాలపువరుసఁ జలిగాయిమనమ్మా

చ.3:
తానాకె మానితినని తారుకాణించఁ బిలిచీ
తేనెలోనఁ దీపులేల తెలిసినమ్మా
పూని శ్రీవేంకటతి బుజ్జగించి నన్నుఁగూడె
తానె యాకెఁజూపెనిందాఁక సటకమ్మా