పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0152-4 శంకరాభరణం సంపుటం: 07-307

పల్లవి:
వరుకు మాపటంత వచ్చేఁ గాని
గెరసు దాఁటకువోయి కేశవరాయ

చ.1:
చేసన్న చాలదా చెట్టవట్టి తియ్యనేల
ఆసల నెదురుచూచే ఆఁటదానికి
రాసీఁ గుచములవి రాయడిఁబెట్టుకువోయి
సేసకొప్పగంటుజారెఁ జెన్నరాయా

చ.2:
పదమంట చాలదా బలిమిసేయఁగనేల
కదియఁగఁ దమకించే కామినికిని
చెదరెఁ గస్తూరిబొట్టు చెరఁగు విడువవోయి
అదె నామై చెమరించె హరికృష్ణరాయ

చ.3:
కాఁగిలిదే చాలదా కన్నుల మొక్కఁగనే
నాఁగువారే ననుపుల ననుఁబోఁటికి
ఆఁగి కూడితివి నన్ను అలసితి రతులలో
వీఁగేవు చెప్పల్లి శ్రీవేంకటరాయా