పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0152-3 సాళంగం సంపుటం: 07-306

పల్లవి:
ఇంతివల్ల నెపో యింతేసి
మంతనంబులే మరపై నిలిచె

చ.1:
కొండల పొడవుల కోరికలింతికి
నిండుఁగుచములై నెరిఁబెరిగె
పండిన జవ్వనభారము తరమయి
మెండుకొనఁదొడఁగె మీఁదటనెట్లో

చ.2:
ఎరగొని చెమటల యేరుల కతమున
పిరిఁది యిసుకదిబ్సలు వొదలె
తిరముగ మాటల తిపులకతమున
తెరలక యధరపుతేనెలు వడిసె

చ.3:
వెలయ వలపు మది వెదలువెట్టఁగా
పులకననలు యింపుల మొలచె
కలగొని శ్రీవెంకటపతి గూడఁగ
వెలిగోరిమణులు వేవేలాయ