పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0152-2 రామక్రియ సంపుటం: 07-305

పల్లవి:
ఇంతలోనివాఁడా తానిస్సీ వీఁడు
పంతమెల్లఁ గంటిఁజాలు పదవే వీఁడు

చ.1:
అలిగి నాతో మాటలాడనివాఁడు నా
చిలుకతో మాటలాడీ చీవీ వీఁడు
నలువంక నాతో నవ్వనివాఁడు నా
చెలితో నవ్వఁగనేలే చెల్లఁబో వీఁడు

చ.2:
వొద్దనె నామోముచూడకుండినవాఁడు నా
అద్దమేల చూచీనే అయ్యో వీఁడు
అద్జో నాకుచములు అంటనివాఁడు నా
ముద్దుఁ గిన్నెరకాయలు ముట్టెనే వీఁడు

చ.3:
పాత్తుమాని వున్నవాఁడు పొదిగి నాయడపము
పొత్తుయేల కలసినే పోపో వీఁడు
యిత్తల శ్రీవేంకటేశుఁడింత సేసి నన్నుఁగూడె
తత్తరపువాఁడు గదే తగునే వీఁడు