పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0152-1 శంకరాభరణం సంపుటం: 07-304

పల్లవి:
ఇంకనేసుద్దులు యెరఁగమిదే
సంకె లేనికోర్కె సఫలంబాయ

చ.1:
నిలువునఁ బులకలు నిండఁగ నిండఁగ
పాలఁతి వలపు పూవక పూచె
పాలయుచు నీపేరు కిన్నెర మీటఁగ
కలికిచనుఁగవలు కాయక కాచె

చ.2:
పనివడి ప్రియములు పలుకఁగఁబలుకంగ
ననుపుమెవి పండక పండె
ఘనమగు కాఁకల కడు చెమరించఁగ
వొనర నవరసములొలుకక వొలికె

చ.3:
సుడిగొని నీపలు సోఁకఁగ సోఁకఁగ
వడిగొని మై మరవక మరచె
యెడయక శ్రీవేంకటేశ నినుఁగలసి
పొడవుగ నిను చెలి పొగడక పాగడె