పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0152-1 హిందోళవసంతం సంపుటం: 07-303

పల్లవి:
చెప్పనేల నీగుణాలు చెలువుఁడ చాలుఁజాలు
వుప్పుదినుటాఁ గాక వుపతాపమా

చ.1:
కంటిఁ గంటి నీచేఁత కన్నులతుదలనే
వెంటనే వీనులనింక వినవలెనా
కంటకములాడ నిన్ను ఘనుఁడ నేనోపనోప
గింటెల నవ్వులలోన గిలిగింతలా

చ.2:
విరహన నీకుఁగా నే వేదనఁబొందుట గాక
వెరవెరఁగక నీతో వెళ్ళనాడేనా
నెరజాణవిన్నిటాను నీవేడ నేనేడ
వులిసిన మీఁదనింక వుడుకులునా

చ.3:
బెట్టుగాఁ గాఁగిట నిన్ను బిగియించుకొంట గాక
నట్లుకొట్టి మోవిమీఁద నసికాట్ల
గుట్టుతో శ్రీ శ్రీవేంకటేశ కూడితివి నన్నునిట్లే
చెట్టువట్టి తీసీ యింకాఁ జేసన్నలా