పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0151-6 మాళవిగౌళ సంపుటం: 07-302

పల్లవి:
కొమ్మల జవ్వనములు కోరువట్టేనా
కమ్మర మాకోరికలు గాదెఁబోసేవా

చ.1:
నామనరయనేల నన్ను నీవొారయనేల
యేమీ మాకుచగిరులెంతలెంతలాయనేమి
లేమల చక్కఁదనాలు లెక్కవా సేవా

చ.2:
ఎక్కువ నాకనుసోగలెంతలెంతలాయనేమి
కక్కసించి యందులోసుంకముగొనేవా
చక్కని నాగోళ్ళివి సరిగాని బేసిగాని
పక్కన నాతో నీవు పందెమాడేవా

చ.3:
చెంతలఁ గూడితి నన్ను శ్రీ వెంకటేశ నా
సంతసపుమోవి లంచముగొనేవా
మంతనాలు నెరుపేవు మరురాజ్యపదవికి
యింతటికి నన్నుఁ బట్టుమేలించేవా