పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0151-5 ముఖారి సంపుటం: 07-301

పల్లవి:
ఎడమాటలిఁకనేల యేమనీనే
అడుగవే చేముంచేదప్పుడో యిప్పుడో

చ.1:
విరహమే వేఁడి విరులే వాఁడి
యెరవుల రమణుఁడు యేమనినే
దరిఁ దొక్కెఁ దలఁపు దట్టుమాయ వలపు
తరవాతిపనులింకఁ దనకో నాకో

చ.2:
తత్తరమే తరవు తాలిములు గరవు
యిత్తల రమణుఁడు దానేమనీనే
వొత్తవచ్చె మరపు వుడివోయ వెరవు
మొత్తమిఁ దనకు నాకు మునుపో వెనకో

చ.3:
పట్టినదె పంతమో పాయమిదిసంతమో
యిట్టె శ్రీవెంకటేశుఁడేమనీనే
రట్టుకెక్కెఁ గాఁగిలి గుట్టెల్ల రతికెక్కె
జట్టిగొనె తానునేను చలి మోబలిమో