పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0105-5 గౌళ సంపుటం: 07-029

పల్లవి:
ఎంతకెంత నా దిక్కు యేమి చూచేవు
కాంతుఁడవు నాకు ఆపె గలయంత కాలము

చ.1:
మఱి వరుస దప్పని మగువవంక గాక నీ
పఱచు గుణాల కెల్లపాటి వున్నదా
యెఱఁగనా నీ సుద్దులు యేల నవ్వే వెన్నటికి
మఱచేవే యాకెఁజూచి మఱచితిఁ గాక

చ.2:
అంగవించి మాటాడేవు ఆపెకు వెఱచే కాక
ముంగిటి నియంత నీకు మోహమున్నదే
యింగితానఁ గానరాదా యేల మొరఁగేవు నాకు
కంగవద్దా ఆపెఁ జూచే కంగనైతిఁ గాక

చ.3:
కౌఁగిటఁ గూడితి వాపె కనుసన్నలనె కాక
వీఁగి శ్రీ వేంకటాద్రి గోవిందరాజా
చేఁగదేరనింకేల నీ చేఁతలకు గడెవెట్టి
ఆఁగవద్దా ఆపెఁ జూచే ఆఁగనైతిఁ గాక