పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0150-6 కేదారగౌళ సంపుటం: 07-296

పల్లవి:
చెప్పుడు మాఁటలివేల చెలులలోన మిమ్ము
మెప్పించరాదుట మీలో మీకే తెలుసును

చ.1:
చాలుకొన్న జంకెనల జగడాలు మీ
వేలికొనగోళ్ళలో విగడాలు
పాలుపుఁ గొపపు చూపుపగడాలు యివి
మేలుమేలు మీలో మీకే తెలును

చ.2:
కింకల మాటలలోని కిసరులు మీ
వుంకువకాఁకలలోని వుసురులు
కొంకనికూరిమిలోని కొసరులు మీ
మంకుల మత్సరములు మనసులే యెరుఁగును

చ.3:
పూనిన మీవలపుల పొంతనాలు నేఁడు
మానరాని కూటముల మంతనాలు
కోనల శ్రీ వేంకటేశ కొమ్మకు నీకు మీ
మేనులు సోఁకినరతి మేకే తెలుసును