పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0150-4 శ్రీరాగం సంపుటం; 07-294

పల్లవి:
సారెసారెకును నేల జంపుమాఁటలు
ఆరెఁ దేరెఁ బదరోరి ఆరడైతిఁకును

చ.1:
ఆడరాదు దొరవని ఆడకున్నఁ బోదు నిన్ను
చూడఁ జూడ నీమోవేల చుక్కలాయరా
తోడ నేఁగొరితి వెంట తొడుకులైనట్లాయ నీ
జూడలెల్లఁ గంటి వింటి చాలుఁజాలుఁ బదరోరి

చ.2:
మొదల నే నెరఁగక మోసపోతిఁగాకనే
కదిసి యేపొద్లు వద్దఁ గాచుకుండనా
యిది మింగిసకడికీ యింకఁ జవులెంచనేల
చెదర నీపంతమెల్లఁ జెల్లెఁజెల్లెఁ బదరోరి

చ.3:
సిగ్గులెల్లం దీరెఁదీరె శ్రీవేంకటేశుఁడ నేఁడు
వెగ్గళమై నీనాసంది వింతలేలరా
దగ్గరి కూడినమీఁద తలపోఁతలింకనేల నే
నగ్గలమై నీ నా కోపమారెఁదేరెఁ బదరోరి