పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0150-2 శంకరాభరణం సంపుటం: 07-292

పల్లవి:
వలపులు వలపులు వయ్యాళి
చలమరి మరుఁడును సమేళి

చ.1:
నెలఁతవమోమునకు నీకనుచూపులు
నిలువున ముత్తెపు నివాళి
కొలఁదికి మీరిన గురుకుచములకును
తొలఁకు నీమనసు దువాళి

చ.2:
వనితనిండు జవ్వన గర్వమునకు
ఘనమగు నీరతి కరాళి
వెనకముందరల వెలఁదిమేనికి నీ
పెనఁగు గోరికొన పిసాళి

చ.3:
పడఁతికోరికల భావంబునకును
కడుఁగడు నీతమి గయాళి
చిడిముడి మగువకు శ్రీ వేంకటపతి
విడువనికూటపు విరాళి