పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0150-1 రామక్రియ సంపుటం: 07-291

పల్లవి:
భ్రమయకు చెలువుండ పలుమారు నీ
తమకపు పట్టుపు తరుణినింతే

చ.1:
నినుఁగని వొకచెలి నిలువునఁ గరఁగెనె
కనకపు బొమ్మే కాఁబోలు
అనువున నదిగాదయితే మెదలునా
మినుకన మెరచిన మెరుఁగింతే

చ.2:
పాలిఁతి నీయెదుటఁ బులకించెనొరప్తు
గల పుష్పలతిక గాఁబోలు
తలఁచకుమటువలెఁ దగదట్లెతే
చెలఁగి పలుకునా చిలుకింతే

చ.3:
పడఁతి నీయురముపై నెలకొనెనదె
కడఁగిన హరము గాఁబోలు
కడపట శ్రీవేంకటపతి గాదది
జడిసెటి నీ శ్రీసతి యింతే