పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0149-5 వరాళి సంపుటం: 07-289

పల్లవి:
ఒకటికినుమడాయ వువిద నీబలఁగము
వొకఁడింతె మరునికి వొదుగనేమిటికి

చ.1:
గండుమీలవంటివి నీకన్నులు కంతునికైతే
గండుమీరనొక్కటెక్కెమే కలఁగకువే
అండనే వొంటితామర అతనిబాణముగాని
రెండుదామరలు నీరిచ్చలహస్తములు

చ.2:
చిలుకల తేరింతే చిత్తజునకు నీకైతే
చిలుకల పలుకులు సేనాసేన
అలులనారివిల్లు అతనికైతే నీకు
అలుల బొమ్మలవిండ్లవె రెండు గదవే

చ.3:
చిగురుఁగైదువ మరుచేతిదింతే నీకయితే
చిగురుఁబాదాలు రెండు చింతయేఁటికే
తగిలి యాతఁడు యేకతాననే వుండుఁ గాని
నిగిడి శ్రీ వేంకటేశు నీవు గూడితివి