పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0149-4 సాళంగనాట సంపుటం: 07-288

పల్లవి:
తనమతి నామతి తారుకాణ గాఁబోలు
వనితకు నాకునొక్కవలపే కాఁబోలును

చ.1:
పాలిఁతిరూపము మతిఁ బొలసినట్టాయ నాకు
తలఁపులో నాకె నన్నుఁ దలఁచఁబొలు
కలసి యింతి నన్నుఁ గాఁగలించినట్టాయ
కలలోననాడ నన్నుఁ గలయంగఁ బోలును

చ.2:
వనజాక్షిచూపు నాపై వడిఁ జల్లినట్టాయ
జునిగి యాకె యెదురుచూడఁబోలును
యెనసి యామగువ యెలుగైనయట్టాయ
అనుఁగుఁజెలితో నన్ను నాడుకొనఁబోలును

చ.3:
అంగన అప్పుడే నా అండ నుండినట్టాయ
రంగుగ నావద్దికిట్టె రాఁబోలును
చెంగటఁ గడితినిటై శ్రీవేంకటేశుఁడ నేను
పంగెననిద్దరికొక్క ప్రాణమే కాఁబోలును