పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0105-4 ముఖారి సంపుటం: 07-028

పల్లవి:
చెల్లఁబో యింకానేల సిగ్గుగాదా
యెల్లవారునెరిఁగిరి యిఁకనేడ సుద్దులు

చ.1:
సిరులతోఁ జెఱఁగు మాసినదానిఁ జీరరాకు
సారిది నల్లంతనుండి చూతువు గాని
వరుస దప్పితే నాడవారిమీంది యానే సుమ్మీ
యెరవులవారమైతి మిఁకనేడ సుద్దులు

చ.2:
మాఁటుననున్న దానితో మాటాడకువయ్య నీవు
ఆఁటాదానిచేతనే చెప్పంపుదు గాని,
కూటమికిఁ బెనఁగితే కుచ్చి ఱట్టు సేతు సుమ్మీ
యేఁటికి నవ్వులు నవ్వేవిఁకనేడ సుద్దులు

చ.3:
చిందువందైనదానిఁ జెనకకువయ్య నీవు
కందువ చెప్పంపి మీఁదఁ గలతు గాని
పొందితి వింతలో నన్నుఁ బోనీక శ్రీ వేంకటేశ
యిందులో నన్నియుఁ గంటిమిఁకనేడ సుద్దులు