పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0149-2 ముఖారి సంపుటం: 07-286

పల్లవి:
ఉవిదకు వొకట్గెతే వొకటిగాదు
వివరించి చూడవయ్య విరసముగాదు

చ.1:
చెమటల యేరు వారి చింతలచెరువు నిండె
కమలాక్షికిది వానకాలముగాదు
జమళిఁ జంద్రోదయమై చకోరములు దనిసె
అమరె శారదసమయమునూఁ గాదు

చ.2:
కన్నీటిమంచు గురిసి కరపల్లవాలు ముంచె
కన్నెకిది హేమంతకాలము గాదు
వెన్నెల నవ్వుచల్లితే వెళ్ళె జాజిపులకలు
విన్నకన్నశిశిరపువేళయుఁ గాదు

చ.3:
వలపులు చిగిరించె వసంతరుతువుఁగాదు
వెలసె విరహపెండ వేసవి గాదు
అలమేలుమంగఁ గూడితపుడె శ్రీ వెంకటేశ
మలయు నీమన్ననలు మరుపేరాదు