పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0148-6 శంకరాభరణం సంపుటం: 07-284

పల్లవి:
తినరాని కొనరాని దేవలోకపుఁబండు
మనసునఁ దలఁచితే మరిగించే పండు

చ.1:
పంటకెక్కి పాలవెల్లిఁ బండిన పాలపండు
తొంటిగొల్లెతల మెవి దొండపండు
అంటుకొన్న మేనిచాయ అల్లునేరేడుఁబండు
ముంటిసింహపుగోళ్ళ ముంఢపండు

చ.2:
ఇచ్చల వేదశాస్తాలు దెచ్చిన పేరీఁతపండు
తచ్చిన దైత్యమారి దేవదారుఁబండు
పచ్చిదేర మెరిసిన బండిగురువిందపండు
యిచ్చవలెనన్న వారియింటనంటిపండు

చ.3:
తెమ్మగా మునులపాలి తియ్యనిచింతపండు
తెమ్మల సిరివలపుఁదేనెపండు
యిమ్ముల శ్రీ వెంకటాద్రినింటింటిముంగిటిపండు
కొమ్మల పదారువేల గొప్పమామిడిపండు