పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0148-5 కేదారగౌళ సంపుటం: 07-283

పల్లవి:
ఎట్లి బాలుఁడు పుట్లెనే యశోద నీకు
వుట్టిపడీనింతలేసికొపనమ్మ నేను

చ.1:
సారెఁ జంకనిడుకొంటే చన్నులకే చెయి చాఁచీ
నీరీతి వీనినెత్తుకోనిందుకే నేను
కోరి తొడలపైనిడుకొని బాల్పోయంగా నవ్వీ
ఆరసి వీనిదగ్గరనందుకే నేను

చ.2:
ముద్దుపెట్టుకొనఁబోతే ముంగురులు చుట్టి పట్ట
వొద్దికీ రోసయించదు ఓయమ్మ నేను
గద్దించి చెక్కునొక్కితే కాఁగలించి విడువఁడు
చద్దివేఁడి వీనిపొందు చాలు (ల?) నమ్మ నేను

చ.3:
అప్పలప్పలనఁబోతే నంగమెల్లా మరపంచీ
ఇప్పుడేమి సేకొంటినిస్సీ నేను
అప్పఁడు శ్రీ శీ వెంకటేశుఁడన్నీఁ దానె యెరుఁగు
చిప్పిలి యాచేఁతలెఁ జెప్పఁజాల నేను