పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0148-4 దేశాక్షి సంపుటం: 07-282

పల్లవి:
నవరములదీనళినాక్షి
జవకట్టి నీకుఁ జవిసేసీని

చ.1:
శృంగారరసము చెలియమొకంబున
సంగతి వీరరసము గోళ్ళ
రంగగు కరుణారము పెదవులను
అంగపుఁ గుచముల నద్భుతరసము

చ.2:
చెలి హస్యరసము సెలవుల నిండీ
పలుచని నడుమున భయరసము
కలికి వాడుఁగన్నుల బీభత్సము
అలబొమ జంకెన నదె రౌద్రంబు

చ.3:
సతిరతిమరపుల శాంతరసంబదె
అతిమోహము పదియవరసము
ఇతవుగ శ్రీ వెంకటేశ కూడితివి
సతమై యీపెకుసంతోసరసము