పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0148-3 మంగళకౌాశిక సంపుటం: 07-281

పల్లవి:
ఆదిమపురుమనియండ నదే
సోదించి చూచిన సుదతై నిలిచె

చ.1:
పున్నమచంద్రుఁడు పాడచెనల్లదివొ
పన్నిన తుమ్మెదపౌఁజులవే
సన్నపుమదనుని శంఖమునల్లదె
యెన్నిక వట్టఁగ నింతై తోఁచె

చ.2:
జక్కవవులుగులు జడిసీనల్లవె
తెక్కుల నిరుదెసఁ దీగెలవే
యిక్కువబయలదె యిసుకదిబ్బలవె
చక్కజాడగా సతియై తోఁచె

చ.3:
సరిననంట్లు రాజనపుఁ బొట్టలవె
వెరవున తామరవిరులునవే
యిరవై శ్రీవెంకటేశ్వరుకాఁగిట
మరిగిన యలమేల్‌మంగైతోఁచె