పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0147-6 వరాళి సంపుటం: 07-278

పల్లవి:
నిన్నుఁ బాసియు నీపతి నీవద్దనున్నాఁడనంటా
పన్ని నీరూపుదలఁచి భావరతి సేయును

చ.1:
పట్టెమంచముకోటిగుబ్బలు నీచన్నులంటా
పట్టి పట్టిచూచి మోమప్పుళించుకొను
అట్టె చిన్నిమలగు అదియె నీమేనంటా
బెట్టి కాఁగలించుకొని బిగియించు సారెకు

చ.2:
మటిచి యిచ్చినయాకు మగువ నీమోవంటా
పడఁతిచేనందుక చప్పరించును
ముడిచిన మేలుకట్టు మొల్లలదండలు నీ
కడగంటి చూపులంటా ఘాతఁ బైపైఁ జూచును

చ.3:
కప్పిన దుప్పటికొంగు కాంత నీపయ్యదంటా
తప్పితారి బలిమిని తన్నుఁదానె తీసును
చెప్పరానిమోహముతో శ్రీ వేంకటేశుఁడు గూడె
యిప్పుడిట్టే నీవురాఁగా ఇదే నిజమాయను