పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0105-3 ముఖారి సంపుటం: 07-027

పల్లవి:
ఇన్నాళ్ళు నెఱఁగనైతి నెచ్చుకుందులాడితి నీ
వన్నెదీయ మెరసేది వనితా భూమిని

చ.1:
యెందరు సతులు నీకు యెట్టెనానుందురుగాక
ముందరి వీడెము నాది మోహము నాది
పొందులఁ దొలుత నిన్ను భోగించిన నా యెంగిలి
అందుక చేయొగ్లినది ఆఁటదా భూమిని

చ.2:
అవ్వల నీవారమని ఆడుకోనీ యెవ్వరైనా
నవ్వులు నీవు నాతోనే ననుపు నాదే
రవ్వల నే నిన్ను నిట్టె రతిసేసిన వలపు
తవ్వి తలకెత్తుకొంటే తరుణే భూమిని

చ.3:
పైకొని నిన్నెవ్వరాస పడేది పడుట గాక
కైకొన్న కౌఁగిలి నాది ఘనత నాది
యీకడ శ్రీ వెంకటేశ యిట్టు నన్నుఁ గూడితివి
వాకు కసివుచ్చుకుంటే వనితా భూమిని