పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0147-5 పాడి సంపుటం: 07-277

పల్లవి:
తనకేమి విచారమే తా నిన్నిటా బలువుఁడు
మనసునఁ బెట్టి మమ్ము మన్నించుమనవే

చ.1:
యేళ్ళవెనుకచాలు యెదుటనే ఫలియించె
రాళ్ళపై నడపులు రట్టుకెక్కెను
తాళ్ళపై చప్పుడుకు తగనిమూకలుగూడె
నీళ్ళపైఁ జొప్పులనె నెరవేరెఁ బనులు

చ.2:
కొండపైఁ బుట్టినవాదు గొప్పయమ్ముమొనఁ దీరె
యెండ పంటివానికులమేలె లోకము
వెండిశికరమువాని వెఱియీవి తుదముట్లె
వండనికూటివారికి వైపాయఁ బనులు

చ.3:
పాముశిరసుపైసామ్ము బలురామరాజ్యమాయ
దోమటివిందులవాదు దొడ్డవారైరి
సేమముతోనుండనీవె శ్రీ వెంకటేశుఁడు దాను
తామసములెల్లఁ బాసి దక్కెనిఁకఁ బనులు