పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0147-4 మధ్యమావతి సంపుటం: 07-276

పల్లవి:
పంతపుఁ జెలులలోన భాగ్యము నాది
యింతటిదాననై రూఢికెక్కితి నేనమ్మా

చ.1:
పవళించి వుండినాను పాదము నామీఁదనే
కవగూడనుండినాను కాఁక నామీఁద
అవలఁ బారకై యున్న హస్తము నామీఁదనే
యివల నాపతిమోహమేమి చెప్పేనమ్మా

చ.2:
తలవంచుకుండినాను తలఁపు నామీఁదనే
పలుకకుండిన నాసబాస నామీఁద
కొలువులోనుండినాను గురుతు నామీఁదనే
యెలమి నాపెద్దరికమేమి చెప్పేనమ్మా

చ.3:
పనిగలిగుండినాను పక్షము నామీఁదనే
మనవి వింటానున్నా మర్మము నామీఁద
అనువై శ్రీ వేంకటేశుఁడన్నిటాను నన్నుఁగూడె
యినుమడించె వలపులేమిచెప్పేనమ్మా