పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0147-11 కేదారగౌళ సంపుటం: 07-273

పల్లవి:
ఎప్పుడును గుట్టుతోడి యిల్లాండ్లము నేము
వొప్పుగ సిగ్గు విడువనోజగాదు మాకును

చ.1:
మాటమాటలను నీకు మనసిచ్చి మెచ్చి యాపె
కాటుకకన్నులఁ జూచి కరఁగించీని
తేటలు నేరుచునాపె తేలించనోపునాపె
యేఁటికి యవ్వరిపొందులేమిబాఁతి యిఁకను

చ.2:
చేయివేసి చేయివేసి చెక్కునొక్కి చేత మొక్కి
మాయపు నవ్వులు నవ్వి మరిగించీని
చాయలకు వచ్చునాపె సరసములాడునాపె
ఆయనాయ వున్నసుద్దులాడనేల యిఁకను

చ.3:
వలపులు చల్లీచల్లి వాటికెగా నిన్నుఁగూడి
యెలయించనేర్చునాపె యిన్నిటానాపె
అలరి శ్రీ వేంకటేశ అప్పటి నన్నుఁగూడితి
తొలుతటిసుద్దులేల దొమ్ములేల యిఁకను