పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0146-6 మధ్యమావతి సంపుటం: 07-272

పల్లవి:
ఏల నాతోఁ గరాళించి యిది వో తప్పు
యీలకూరకుప్పు చాలదిదివో తప్పు

చ.1:
మరఁగున నాపె నీతో మాటలెల్లఁ జెప్పఁగాను
యెరఁగక వింటిమి యిదివో తప్పు
మెరయఁగ సరసము మీఁదమీఁదనాడఁగాను
యెరుకతో వద్దనుంటిమిదివో తప్పు

చ.2:
చెక్కు నొక్కి ఆపె నీతో చేఁతలెల్లాఁ జేయఁగాను
యెక్కుడుగా నవ్వితిని యిదివో తప్పు
వక్కణించి నీతోఁ దన వలపులు చెప్పఁగాను
యిక్కువలు గరఁగితి యిదివో తప్పు

చ.3:
మెచ్చి తనచన్నులు మీఁదనట్టె మోపఁగాను
యెచ్చరిక సేసితివి యిదివో తప్పు
నచ్చుల శ్రీ వేంకటేశ నన్ను నీవు గూడఁగాను
హెచ్చి తన్నునడిగితి యిదివో తప్పు