పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0146-5 శ్రీరాగం సంపుటం; 07-271

పల్లవి:
వనితపాలికిని దేవరవు నీవు
వనమె జవ్వనమిందె వరమియ్యవలెను

చ.1:
ముదితకు నీతోమాట మోహనమంత్రము
చదరపు నీవురము జపశాల
మదిలోన నీరూపు మరవని ధ్యానము
వదలరాదిఁక నీవు వరమియ్యవలెను

చ.2:
పడఁతికి నీశయ్య బలుపుణ్యక్షేత్రము
వొడలిచెమట నీపై హోమకృత్యము
అడరుమోవితేనెలు ఆరగింపు నవేద్యాలు
వడిఁ జేకొనిఁక నీవు వరమియ్యవలెను

చ.3:
కామినికి నీకూటమి ఘనదివ్యయోగము
నేమపుఁ బరవశము నిజానందము
ఆముక శ్రీవేంకటేశ ఆపె నీవుఁ గూడితిరి
వాములుగా నింకానిట్టే వరమియ్యవలెను